అందరికీ టీకా ఇవ్వాలంటే మరో మూడేళ్లు పడుతుందేమో

అందరికీ టీకా ఇవ్వాలంటే మరో మూడేళ్లు పడుతుందేమో

ముంబై: వ్యాక్సినేషన్ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శివసేన పార్టీ విమర్శించింది. మోడీ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే దేశంలో కరోనా మరణాలు ఇంతగా నమోదయ్యాయని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన ఫైర్ అయ్యింది. టీకా ప్రక్రియ అమలులో కేంద్రం మరింత పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిందని సూచించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును చూస్తుంటే మొత్తం దేశ ప్రజలకు టీకా ఇచ్చేందుకు మరో నాలుగైదు ఏళ్లు పట్టేలా కనిపిస్తోందని పేర్కొంది. వైరస్ ప్రతిసారి ఓ కొత్త రూపాన్ని సంతరించుకుంటోందని.. దీని వల్ల ఫార్మా కంపెనీలు కొత్త వ్యాక్సిన్‌లు రూపొందిస్తూ కోట్ల లాభాలు గడిస్తున్నాయని ఆరోపించింది. కేంద్ర వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీం కోర్టు స్పందించిన తీరుపై శివసేన హర్షం వ్యక్తం చేసింది.