ఈడీ సమన్లను ఉద్దేశిస్తూ షిండే కొడుకు ఎద్దేవా

ఈడీ సమన్లను ఉద్దేశిస్తూ షిండే కొడుకు ఎద్దేవా

ముంబై: ‘ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు అందుకున్న సంజయ్​ రౌత్​కు నా అభినందనలు’.. అంటూ మహారాష్ట్ర ఎంపీ, ఏక్​నాథ్​ షిండే కొడుకు శ్రీకాంత్​ షిండే సోమవారం ఎద్దేవా చేశారు. పత్రా చావల్​ ల్యాండ్​ స్కామ్​ కేసులో విచారణకు రావాలంటూ సంజయ్​కు ఈడీ సమన్లు పంపింది. దీనిపై శ్రీకాంత్​ సోమవారం స్పందించారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపైనా శ్రీకాంత్​ షిండే మండిపడ్డారు. ఆలోచించి మాట్లాడాలని సూచించారు.