అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్‌లో శివ పాలడుగు తెరకెక్కించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ మ్యూజిక్ షాపు నడుపుకునే వ్యక్తి, తన వయసుతో సంబంధం లేకుండా డీజే అవ్వాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే ఇన్‌స్పైరింగ్ జర్నీనే కథ. పాతికేళ్ల వయసులో సాధించలేనిది, యాభై ఏళ్ల వయసులో సాధించే ప్రయత్నం ఎంత ఎమోషనల్‌గా ఉంటుందనేది మెయిన్ కాన్సెప్ట్. అజయ్ ఘోష్ అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారు.
ఆయనైతే కొత్తగా ఉంటుందని ఎంచుకున్నాం. అప్పటికి ‘పుష్ప’ చిత్రం కూడా రాలేదు. మూర్తి జీవితంలో చాందిని పాత్ర వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. సందర్భానికి తగినట్టుగా పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మా సినిమా కంటెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుంది’ అని చెప్పాడు.