తమిళనాడులో విజయ్ని దాటేశాడు.. ఇది శివకార్తికేయన్ మాస్ రాంపేజ్

తమిళనాడులో విజయ్ని దాటేశాడు.. ఇది శివకార్తికేయన్ మాస్ రాంపేజ్

తమిళ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్(Shivakarthikeyan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మావీరన్(Maveeran). ఈ సినిమా తెలుగులో మహావీరుడు(Mahaveerudu) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. 

మడోన్ అశ్విన్(Madonne ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినా కూడా మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్ములేపింది ఈ సినిమా. దీంతో ఇది ప్యూర్ శివకార్తికేయన్ డామినేషన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు రెండో రోజు ఈ సినిమా విజయ్(Vijay) ప్రీవియస్ మూవీ వారిసు(Varisu) కలెక్షన్స్ ను దాటేసింది. తమిళనాడులో వారిసు మూవీ రెండోరోజు రూ.8.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. మావీరన్ ఏకంగా రూ.9.34 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో తమిళనాడులో శివకార్తికేయన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతోంది.
 
ఈ దెబ్బతో ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు శివకార్తికేయన్. మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే.. రానున్న రోజుల్లో శివకార్తికేయన్.. విజయ్(Vijay), అజిత్(Ajith) రేంజ్ క్రేజ్ సంపాదించడం ఖాయమనే కామెంట్స్ చేస్తున్నాయి తమిళ ఇండస్ట్రీ వర్గాలు. అంతేకాదు ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే లాంగ్ రన్ లో  మావీరన్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.