విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం

V6 Velugu Posted on Nov 25, 2021

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజుల నుంచి ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివ శంకర్ తో పాటు ఆయన పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్యకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

Tagged coronavirus, tollywood, Shivashankar master, dance master shivashankar

Latest Videos

Subscribe Now

More News