వణికిస్తున్న చలి.. ఢిల్లీలో స్కూళ్లు బంద్

వణికిస్తున్న చలి.. ఢిల్లీలో స్కూళ్లు బంద్
  • ఈ నెల15 దాకా సెలవులు పొడిగించిన సర్కారు
  • సింగిల్ డిజిట్​కు చేరిన టెంపరేచర్లు
  • సఫ్దర్​జంగ్​లో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత
  • సిటీని కమ్మేస్తున్న పొగమంచు.. ఇబ్బందులు పడుతున్న జనం

న్యూఢిల్లీ: చలి తీవ్రత పెరగడంతో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సర్కారు సెలవులు ప్రకటించింది. టెంపరేచర్లు సింగిల్ డిజిట్​కు పడిపోవడంతో శీతాకాల సెలవులను ఈ నెల 15 దాకా పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. సఫ్దర్ జంగ్ లో ఆదివారం అత్యల్పంగా 1.9 డిగ్రీలుగా నమోదైందని ఇండియన్ మెటిరియోరాలజికల్ డిపార్ట్​మెంట్(ఐఎండీ) తెలిపింది. ఆయనగర్​లో 2.6, లోధిరోడ్​లో​2.8, పాలెంలో 5.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. దట్టంగా పొగమంచు పడుతుండటం, చలిగాలులు వీస్తుండటంతో జనాలు బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్​క్వాలిటీ కూడా తగ్గి వెరీపూర్ కేటగిరీలోకి వెళ్లింది. ఢిల్లీసహా నార్త్​లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

జైపూర్ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవులు

గాలులు వీస్తుండటంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. యూపీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్​లలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోతున్నాయి. రాజస్థాన్​లోని జైపూర్​ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సోమవారం నుంచి ఈ నెల 14 దాకా సెలవులు పొడిగించారు.బరన్ జిల్లాలోనూ ఒకరోజు సెలవు పొడిగించారు. 

లక్నో జూలో జంతువుల కోసం హీటర్లు

చలి విపరీతంగా పెరగడంతో ఉత్తరప్రదేశ్​లోని​ లక్నో జూపార్క్​లో జంతువుల కోసం హీటర్లు ఏర్పాటు చేశారు. బోన్లకు దుప్పట్లు కప్పారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు బోన్లలో వెచ్చగా ఉండేందుకు ఎండుగడ్డిని ఉంచారు.