
ఉత్తరప్రదేశ్ లోని దోహ్రీఘాట్ పట్టణంలో ఘాగ్రా నదిలో 50 కిలోల వెండి శివలింగం దొరికింది. బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న రామ్ మిలన్ సాహ్ని అనే వ్యక్తి చేతికి ఈ శివలింగం తాకింది. ఎంతో బరువుగా ఉండటంతో మరోకరి సహాయంతో ఈ శివలింగాన్ని బయటకు తీశారు రామ్ మిలన్. ఆ తర్వాత ఆ లింగాన్ని గ్రామంలోని ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఈ శివలింగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు . పూజలు చేసేందుకు కొందరు భక్తులు పోలీసు స్టేషన్‌కు కూడా చేరుకున్నారు. ఈ శివలింగంపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని విచారణ అనంతరం శివలింగాన్ని ప్రజలకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
UP | Some people saw a glowing object in the Ghaghra river. On taking out the object, it was found that it is a Shivling, it has been kept in the Malkhana of the police station respectfully. It will be investigated by special agencies: Avinash Pandey, SP Mau (16.07) pic.twitter.com/vd734g7QSc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 16, 2022