Ind vs Pak: ఆసియాకప్ ఫైనల్కు ముందు ఇండియాకు షాక్.. హార్ధిక్ పాండ్యా ఔట్..? ఫైనల్ టీం ఇదే..

Ind vs Pak: ఆసియాకప్ ఫైనల్కు ముందు ఇండియాకు షాక్.. హార్ధిక్ పాండ్యా ఔట్..? ఫైనల్ టీం ఇదే..

ఆసియా కప్ లో వరుస విజయాలతో జోరుమీదున్న ఇండియా.. ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంకపై సూపర్ ఓవర్ లో సూపర్ విన్నింగ్ తో.. ఫైనల్ బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.  మరోసారి పాక్ ను మట్టికరిపించేందుకు రెడీ అయ్యింది. 

అయితే ఫైనల్ పోరులో పాక్ ను ఛాలెంజ్ చేయడానికి స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా సిద్ధమయ్యాడు. అదే విధంగా శివం దూబే కూడా ఫైనల్ లో ఆడనున్నాడు. శ్రీలంల మ్యాచ్ లో బుమ్రా లేకపోవడంతో ఇబ్బందికరంగా అనిపించినా.. స్లాగ్ ఓవర్లలో అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌల్ చేసి మ్యాచ్ ను టర్న్ చేయటమే కాకుండా సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. 

అయితే ఫైనల్ క్లాష్ కోసం ఇండియా కొన్ని ఛేంజెస్ చేస్తోంది. బుమ్రా కంబ్ బ్యాక్ ఇవ్వడంతో.. బుమ్రాకు జోడీగా హార్ధిక్ పాండ్యా ఉంటాడని అందరూ భావించారు. కానీ శ్రీలంక మ్యాచ్ లో ఒకే ఒక ఓవర్ వేసి ఆఫ్ ఫీల్డ్ కు వెళ్లిపోవడం ఆందోళన కలిగించింది. దీంతో పాండ్యాకు ఏమైంది.. ఆరోగ్యం బాలేదా.. ఫిట్నెస్ సమస్యలా అనే డౌట్స్ ప్రతిఒక్కరిలో నెలకొన్నాయి.

ఫైనల్ లో పాండ్యా ఆడతాడా లేదా అనేది ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ హార్తిక్ మిస్సైతే.. హర్ష్ దీప్ ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. డెత్ ఓవర్లలో బ్రిలియంట్ గా బౌలింగ్ వేయడం కలిసొచ్చే అంశం. అయితే శ్రీలంక మ్యాచ్ లో పూర్ పర్ఫామెన్స్ తో డిజప్పాయింట్ చేసిన హర్షిత్ రాణా ప్లేస్ లో శివం దూబే రావటం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యింది. 

పాక్ తో ఫైనల్ మ్యాచ్ లో.. అబిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత వరుసగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఉంటారు. అయితే ప్లేయింగ్ లెవెన్ లో హార్ధిక్ ఉండేలా ఇండియా ప్లాన్ చేస్తున్నప్పటికీ.. ఒకవేళ ఫిట్ గా లేడనిపిస్తే.. 6వ స్థానంలో దూబే ఆడనున్నాడు. అక్షర్ పటేల్ 7వ స్థానంలో బ్యాంటింగ్ కు రానున్నాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ .. స్పిన్.. బుమ్రా, అర్షదీప్ సింగ్ పేస్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాండ్యా రెడీ ఉంటే.. ఫైనల్ టీమ్ నుంచి అర్షదీప్ ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

ఇండియా ప్లేయింగ్ 11 : శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్వర్తి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా/అర్ష్‌దీప్ సింగ్