కేసీఆర్కు షాక్ : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్

కేసీఆర్కు షాక్ : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్కు మరోషాక్ తగిలింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీ వీడి ఒకరోజు గడవకముందే మరో సిట్టింగ్ ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం (మార్చి 1,2024) జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ..పార్టీ కండువా కప్పి బీబీ పాటిల్ ను బీజేపీలోకి ఆహ్వానించారు.  గురువారం (ఫిబ్రవరి 29) నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగా.. తాజాగా బీబీపాటిల్ బీజేపీలో చేరడంతో బీఆర్ ఎస్ శ్రేణుల్లో  గుబులు మొదలయ్యింది. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ .. లోక్ సభ ఎన్నికల సమయంలో నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారు. త్వరలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. బీజేపీ విధానాలకు ఆకర్షితులై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరారని అన్నారు. 

పార్లమెంట్​ఎన్నికల ముందు బీఆర్ఎస్​కు మరో షాక్​ తగిలింది. బీఆర్ఎస్ ఎంపీలు వరుసగా బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత కారు దిగి కాంగ్రెస్​లో చేరగా, గురువారం (ఫిబ్రవరి 29) నాగర్​కర్నూల్​ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఆయన కొడుకు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి అమిత్​షా సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీ బీపాటిల్ బీజేపీలో చేరడంతో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది. 

 

  • Beta
Beta feature