టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ రాజీనామా

టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ రాజీనామా
  • కలెక్టరేట్ ఎదుట టీచర్ల ధర్నాలో రాజీనామా ప్రకటన
  • మిగతా ఎమ్మెల్సీలతో కూడా రాజీనామా చేయిస్తా –పూల రవీందర్

భువనగిరి జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్న వారు ఏకంగా పార్టీకి రాజీనామా చేసేందుకు వెనుకాడడం లేదు. పీఆర్సీ కోసం కలెక్టరేట్ దగ్గర టీచర్లు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. టీచర్ల ఒత్తిడి మేరకు తాను TRS పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మిగతా ఎమ్మెల్సీలతో  రాజీనామా చేయిస్తానని సభా ముఖంగా తెలిపారు. తనకు పీఆర్టీయు నే ముఖ్యమని, టీఆర్ఎస్ పార్టీ కాదని  పూల రవీందర్ స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక అందరి బతుకులు బాగుపడతాయనుకుంటే విచిత్రంగా కష్టాలకు గురిచేయడం సహించరానిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

ఇవి కూడా చదవండి

అవును.. వీరు పేకాటకు బానిసలు

నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

రేప్ అంటే చావును కోరుకున్నట్లే .. ఏడుగురికి మరణశిక్ష

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం