ముంబై ఎయిర్ పోర్టుకు షోకాజ్ నోటీసులు..

ముంబై ఎయిర్ పోర్టుకు షోకాజ్ నోటీసులు..

ఫినాన్షియల్ క్యాపిటెల్ ఆఫ్ ఇండియా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటిసులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లోని టార్మాక్‌పై ప్రయాణికులు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం ఇండిగో ఎయిర్ లైన్స్ కు ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

జనవరి 15, సోమవారం అర్ధరాత్రి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్ని మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత  ఈ నోటీసులు జారీ చేశారు.  నోటీసులకు జనవరి 16 మంగళవారంలోగా ప్రతిస్పందనలు ఇవ్వాలని తెలిపారు. గడువులోగా ప్రత్యుత్తరాలు రాకపోతే, ఆర్థిక జరిమానాలతో సహా అమలు చర్యలు ప్రారంభించబడతాయని హెచ్చరించారు.