రాజ్నాథ్సింగ్ ఇచ్చిన స్లిప్ చూసి వసుంధర రాజే షాక్.. అందులో ఏముందంటే..

రాజ్నాథ్సింగ్ ఇచ్చిన స్లిప్ చూసి వసుంధర రాజే షాక్.. అందులో ఏముందంటే..

రాజస్థాన్ కు కొత్త సీఎం గా భజన్ లాల్ ను ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చింది బీజేపీ..ముఖ్యంగా సీఎం రేసులో ముందున్న వసుంధరా రాజేకు గట్టి షాక్ ఇచ్చింది.బీజేపీ శాషన సభా పక్ష సమావేశం తర్వాత కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజస్థాన్ కొత్త సీఎం పేరును ఓ స్లిప్ రాసి వసుంధరరాజేకు ఇచ్చారు. అప్పటి వరకు ఆ పేరును ఎవరూ ఊహించలేదు. వసుంధరా రాజే అస్సలు ఊహించలేదు. తనకే సీఎం పదవి వస్తుందని కోటి ఆశలతో వేదికపై హుందాగా కూర్చింది. రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన స్లిప్ లో పేరును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది.

ఆ స్లిప్ లో రాజస్థాన్ సీఎంగా కొత్త ముఖం భజన్ లాల్ శర్మ పేరు చూసి అవాక్కయింది. ఊహించని పరిస్థితికి వసుంధర రాజే బిత్తరపోయి రాజ్ నాథ్ సింగ్ వైపు చూసింది. సీఎంగా భజన్ లాల్ ను ప్రకటించిన వెంటనే సభనుంచి వెళ్లిపోయారు వసుంధరారాజే. ఆ సీన్ కు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

ఎవ్వరూ ఊహించని నిర్ణయాలను బీజేపీ అమలు చేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి.. అధికారం చేజిక్కించుకుని.. సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రి పదవుల కేటాయింపు వరకు బీజేపీ అధికారం ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఒక్క రాజస్థాన్ విషయంలో నే కాదు.. బీజేపీ గెలిచిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించింది బీజేపీ. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అటు బీజేపీ నేతలతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.. ఏకంగా సీఎం రేసులో ఉన్న వసుంధర రాజే కూడా బిత్తర పోయారంటే.. బీజేపీ నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఊహించొచ్చు.