
హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసిన సంగతి తెలిసిందే... సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేసింది రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బ్లాస్టింగ్ ఎక్స్‌పర్మెంట్స్ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని శనివారం ( మే 17 ) అరెస్ట్ చేసింది. ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్(28)ను అదుపులోకి తీసుకొని, విజయనగరం పోలీసులకు అప్పగించింది కౌంటర్ ఇంటెలిజెన్స్. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ పేలుళ్ల కుట్రలో ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని.. ఈ గ్రూప్ లో సిరాజ్, సమీర్ లతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆరుగురు సభ్యులు హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్నట్లు తెలిపారు.ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని...టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మిగతా నలుగురికి బాంబ్‌లు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ALSO READ | గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై..ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు
సిరాజ్ అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు సిరాజ్, సమీర్ లకు 14రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. బోయిగూడలో ఉంటున్న సమీర్..ఎప్పుడూ తమతో గొడవలు పడేవాడని తెలిపారు బస్తీవాసులు.వెంటనే వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని బస్తివాసుల డిమాండ్..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులకు తెలిపారు బస్తీవాసులు.సమీర్ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్ లను తరచూ కలిసేవాడని తెలిపారు స్థానికులు.