తిండితో చంపేస్తారా..? : ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లో బూజు పట్టిన జీడిపప్పు.. కుళ్లిపోయిన ఉల్లిపాయలు

తిండితో చంపేస్తారా..? : ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లో బూజు పట్టిన జీడిపప్పు.. కుళ్లిపోయిన ఉల్లిపాయలు

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, హోటల్స్ పై వరుస దాడులతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని పలు పేరు మోసిన హోటల్స్ రెస్టారెంట్లపై జరిగిన దాడుల్లో బయటపడ్డ విషయాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి, బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది.పేరు మోసిన హోటళ్లు రెస్టారెంట్లు కూడా నాసిరకపు వస్తువులు, గడు ముగిసిన వస్తువులు వాడి వంటలు చేస్తుండటం అందరిని షాక్ కి గురి చేసింది.

తాజాగా కొంపల్లిలోని ఓ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. సోమవారం సదరు ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో అధికారులు సోదాలు నిర్వహించగా పాడైపోయిన కాజు, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు గుర్తించారు. అంతే కాకుండా సింక్ లో నీళ్లు బ్లాక్ అయ్యి కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం గమనించారు అధికారులు. సాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు.

వట్టినాగులపల్లిలోని  ప్రిజం బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఇదే తరహా అంశాలు బయటపడ్డాయి. ఈ రెస్టారెంట్ స్టోర్ రూమ్ మొత్తం ఎలుకలు, ఎక్స్పైర్ అయిన ఫుడ్ తో నిండి ఉండటం గమనించారు అధికారులు. అంతే కాకుండా ఫ్రిడ్జ్ లో కుళ్లిపోయిన కూరగాయలతో కిచెన్ అంత కంపు కొడుతున్న పరిస్థితి. మరో పక్క, మేడ్చల్ లోని తాజా ఆల్ డే బ్రేక్ ఫాస్ట్ హోటల్లో కూడా పాడైపోయిన దాల్చి చెక్కను గుర్తించారు అధికారులు. అంతే కాకుండా సిబ్బంది యొక్క మెడికల్ రికార్డ్స్ లేకపోవటం, పేస్ట్ కంట్రోల్ మెజర్స్ లేకపోవటం గమనించారు అధికారులు.