ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్.. NPA ప్రివిలేజ్ కమిటీ విచారణలో షాకింగ్ నిజాలు!

ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..  NPA ప్రివిలేజ్ కమిటీ విచారణలో షాకింగ్ నిజాలు!

ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆరోపణలపై 8 రోజుల్లో వివరణ ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు నోటీసులు పంపగా.. నేషనల్ పోలీస్ అకాడెమీ ఈ ట్రైనీ ఐపీఎస్ కు షాకిచ్చింది. తోటీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని నేషనల్ పోలీస్ అకాడెమీ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఉదయ్ కృష్ణా రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన ప్రవర్తనపై మహిళా ట్రైనీ ఐపీఎస్ NPA లో పై అధికారులకు ఫిర్యాదు చేసింది.  దీంతో ఈ ఆరోపణలపై NPA ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. సీసీ కెమెరాలు ఆధారాలతో పాటు అన్ని ఎవిడెన్స్ సేకరించాక.. ఉదయ్ కృష్ణా రెడ్డి పై ఆరోపణలు నిజమేనని ప్రివిలేజ్ కమిటీ  నిర్ధారించింది. కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని NPA నుండీ పంపించేశారు అధికారులు.

ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన ట్రైనీ ఐపీఎస్.. సహచర ట్రైనీపై లైంగిక వేధింపులకు దిగటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రివిలేజ్ కమిటీ.. తక్షణమే NPA నుండీ సస్పెండ్ చేస్తూ  నిర్ణయం తీసుకుంది. సర్వీస్ లో జాయినింగ్ కు సంబంధించి డివోపిటీ దే తుది నిర్ణయం అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ALSO READ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్యాయత్నం.. 

కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచిన విజయ్ కృష్ణారెడ్డి.. లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.