స్టూడెంట్ను మోకాళ్లపై నడిపించిన టీచర్: కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేసిన స్టూడెంట్ తండ్రి

స్టూడెంట్ను మోకాళ్లపై నడిపించిన టీచర్: కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేసిన స్టూడెంట్ తండ్రి

శాంతినగర్, వెలుగు: టీచర్ ప్రశ్న అడిగితే జవాబు సరిగా చెప్పలేదని  స్టూడెంట్ ఉదయ్ కుమార్ ను మోకాళ్లపై నడిపించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులకల్ స్టేజి దగ్గర ప్రైవేట్ స్కూల్ లో మంగళవారం జరిగింది. ఈ ఘటనపై స్టూడెంట్​ తండ్రి రంగన్న బుధవారం కలెక్టర్ సంతోష్, డీఈవోలకు ఫిర్యాదు చేశారు. 

పేరెంట్ తండ్రి వివరాల మేరకు.. వడ్డేపల్లి మండలం జూలకల్ స్టేజి దగ్గర ఉన్న శారద విద్యానికేతన్ లో ఉదయ్ కుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం స్కూల్ కి వెళ్ళగా టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని కొట్టి రెండు పీరియడ్ల పాటు మోకాళ్ల మీద నడిపించడంతో రెండు మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. తమ కుమారుడిని కొట్టిన టీచర్ తో పాటు స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈవోకు స్టూడెంట్​ తండ్రి కంప్లైంట్ చేశాడు.