నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. అత్తతో అల్లుడి సంబంధం.. మామ హత్య

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. అత్తతో అల్లుడి సంబంధం.. మామ హత్య

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ఈ నెల 23న జరిగిన అమ్మపల్లి యాదయ్య (50) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

యాదయ్యకు ఉన్న ఒకటిన్నర ఎకరం భూమిని అల్లుడు ఆంజనేయులు పేరిట రాయాలని భార్య అలివేలు రెండేండ్లుగా ఒత్తిడి చేస్తుండటం, అలాగే భార్యకు అల్లుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో యాదయ్య తరచూ గొడవ పడుతుండటంతో అతడిని వదిలించుకోవాలని భార్య, కూతురు పద్మ, అల్లుడు కలిసి పథకం వేశారు.

ఈ నెల 23న గొడవ జరిగిన క్రమంలో అల్లుడు ఆంజనేయులు యాదయ్య గొంతు పట్టి గోడకేసి కొట్టగా, కూతురు కాళ్లు పట్టుకోగా, భార్య అలివేలు రాడ్డుతో ఛాతిపై కొట్టి  ప్రాణాలు తీశారు. మరుసటి రోజు యాదయ్య అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేసేందుకు భార్య ప్రయత్నించగా, మృతుడి ఛాతిపై గాయాలను చూసి అనుమానం వచ్చిన బంధువు పరశురాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో రంగంలోకి దిగిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై శ్రీనివాసరావుల బృందం వారిని విచారించగా ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.