షాకింగ్ వీడియో: ఆడుకుంటున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు

షాకింగ్ వీడియో: ఆడుకుంటున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు

సీసీ కెెమెరాలో రికార్డయిన దృశ్యాలు

హైదరాబాద్: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..  ఇళ్లలోనే కాదు.. ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారులపై నిరంతరం ఒక కన్నేయకపోతే ఘోరాలు జరిగిపోతాయి. దీనికి ఇదే తాజా నిదర్శనం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరి సంబరాల్లో వారుండడమ కాదు.. పిల్లలను చూసుకుంటూ ఉండాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందో.. ఎంతటి ఘోరాలు జరుగుతాయో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరధిలోని ఉప్పర్ పల్లి, అశోక్ విహార్ పేజ్ 2 లో జరిగిందీ ఘటన. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు బయటకు రావడంతో సంచలనం రేపింది. అపార్టుమెంటు మెయిన్ గేటు ముందు ఆడుకుంటున్న చిన్నారి ని గమనించకుండా అతనిపై నుండే కారు వెళ్లిపోయింది. ఆడుకుంటున్న బాలుని పై నుండే కారు వెళ్లిపోవడం సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. కారు స్లో గా వెళ్లడంతో ప్రమాదం తప్పిపోయింది. కారు మీద నుండి వెళ్లిపోయినా సదరు బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వాహనదారులు కూడా చిన్న పిల్లలు ఉన్నచోట, రెసిడెన్షియల్ ఏరియాల్లో స్లో గా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరించారు.

సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఇది..

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

సంక్రాంతి వేడుకంతా రైతుదే