బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాంకాక్‌లోని చతుచక్ మార్కెట్ నుంచి కొద్ది దూరంలో ఉన్న ఓర్ టోర్ కోర్ మార్కెట్‌లోకి దుండగుడు చొరబడి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ మృతి చెందారు. అనంతరం దుండగుడు సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో ఈ కాల్పులకు వాటితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
