చిన్న వ్యాపారాలకు  షాప్​మాటిక్​ ఆఫర్‌‌‌‌!

చిన్న వ్యాపారాలకు  షాప్​మాటిక్​ ఆఫర్‌‌‌‌!

3 నెలలు హోస్టింగ్​ ఛార్జీలుండవ్​
​హైదరాబాద్​, వెలుగు:  ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​ షాప్​మాటిక్​ ఇండియాలోని తన కస్టమర్ల కోసం ఇన్​స్పైరింగ్​ ఎంట్రప్రెనూర్షిప్​ ప్రోగ్రామ్​ తెచ్చింది. జూన్​ 3 నుంచి ఆగస్టు 31 దాకా మూడు నెలలపాటు ఈ కొత్త ప్రోగ్రామ్​ కింద ఎలాంటి హోస్టింగ్​ ఛార్జీలు వసూలు చేయమని షాప్​మాటిక్​ ప్రకటించింది. ఎలాంటి సైన్​ అప్ ఛార్జీలు లేకుండానే కస్టమర్లు తమ ఈ–కామర్స్ (ఆన్​లైన్​ బిజినెస్)​ ను సెటప్​ చేసుకోవచ్చని వెల్లడించింది. తమ ప్రొడక్టుల అమ్మకాల మీద 3 శాతాన్ని మాత్రం చెల్లించాల్సి ఉంటుందని సింగపూర్​ కంపెనీ షాప్​మాటిక్​ తెలిపింది. చిన్న వ్యాపారులు ఆన్​లైన్‌‌లోకి మారేందుకు తమ వద్ద 4 ఆప్షన్లు ఉన్నాయని, ఇందులో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చని షాప్​మాటిక్​ సీఈఓ అనురాగ్​ ఆవుల చెప్పారు. ఎంట్రప్రెనూర్లను ఎంకరేజ్​ చేయడం కోసమే నెలవారీ హోస్టింగ్​ ఛార్జీలను ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.