షాప్సీ గ్రాండ్ మేళాలో అదిరిపోయే ఆఫర్లు.. చిన్న పట్టణాల నుంచి భారీగా ఆర్డర్లు

షాప్సీ గ్రాండ్ మేళాలో అదిరిపోయే ఆఫర్లు.. చిన్న పట్టణాల నుంచి భారీగా ఆర్డర్లు
  • వెల్లడించిన షాప్సీ 

హైదరాబాద్​, వెలుగు: పండుగ సీజన్ ​కోసం ప్రారంభించిన గ్రాండ్ మేళాలో 70 శాతం కంటే ఎక్కువ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లు, యాప్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్స్​ టైర్ 3, 4 నగరాలు, చిన్న పట్టణాల నుంచే వచ్చాయని ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్​కు చెందిన రిటైలర్​ షాప్సీ తెలిపింది. తక్కువ ధరలకే వచ్చే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతోందని తెలిపింది. తమ కస్టమర్లలో యువతే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. 

హోం అప్లయన్సెస్​, పురుషుల ఫ్యాషన్, ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్ విభాగాలలో రికార్డు వృద్ధి నమోదయిందని, రిపీటెడ్​బయర్స్​ 44 శాతం పెరిగారని తెలిపింది. రూ. 149 - లోపు ధర కలిగిన కోటికి పైగా ఉత్పత్తులను అందిస్తున్నామని వెల్లడించింది. ఈసారి హోం అప్లయన్సెస్​లో 108 శాతం, పురుషుల సాధారణ దుస్తులు, ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో 95 శాతం పెరుగుదల కనిపించిందని సంస్థ సీనియర్​ఎగ్జిక్యూటివ్ ​ఒకరు వివరించారు.