కూలీల కొరత.. చేలల్లో రాలుతున్న పత్తి

కూలీల కొరత.. చేలల్లో రాలుతున్న పత్తి

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పత్తి తీసేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తికి రూ.12 నుంచి రూ.15 చెల్లిస్తున్నా దొరకడం కష్టంగా ఉంది. కొందరు రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను రప్పించి ఇప్పటికే మొదటి విడత పత్తి తీయించారు. ప్రస్తుతం రెండో విడత తీయిస్తున్నారు. 

అయితే వారికి షెల్టర్​తోపాటు కట్టెలు, నీళ్లు, అడిగినంత కూలి ఇవ్వాలి. అంత ఖర్చు భరించలేని రైతుల చేలల్లోని పత్తి నేటికీ అలాగే ఉంది. చాలా చోట్ల చెట్ల నుంచి పత్తి రాలిపోతోంది. చేల నిండా పగిలిన పత్తి కనిపిస్తున్నా తీయించలేకపోతున్నామని రైతులు దిగాలు పడిపోతున్నారు. ఇటీవల పడిపోయిన పత్తి రేట్లతో మరింత టెన్షన్​ పడుతున్నారు. కూలీల కొరతకు వరి నాట్లు మొదలవడం కారణంగా తెలుస్తోంది. దహెగాం మండలం వ్యాప్తంగా ప్రస్తుతం 23 వేల ఎకరాల్లో పత్తి పగిలింది. జిల్లా వ్యాప్తంగా కూలీల కొరత ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.

  వెలుగు, దహెగాం