ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం 26 వేల 40 స్కూల్స్ ఉండగా.. 21 లక్షల 50వేల మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో చదువుతున్నారు. స్కూల్స్‭లో 25వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 16వేల మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉంది. అయితే.. ఈ ఏడాది ప్రభుత్వం విద్యావాలంటీర్లను నియమించలేదు. మరోవైపు పాఠాలు చెప్పేవారు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. 

ఇక ఉన్నవారినే డబుల్ క్లాసులు చెప్పమని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో.. ఉపాధ్యాయులు ఇబ్బందికి గురవుతున్నారు. టెన్త్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.