బోర్డియక్స్ టోర్నీ రన్నరప్‌‎గా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాంబ్రీ జోడీ

బోర్డియక్స్ టోర్నీ రన్నరప్‌‎గా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాంబ్రీ జోడీ

న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ బోర్డియక్స్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ గాలోవేతో కలిసి బరిలోకి దిగిన యూకీ ఆదివారం జరిగిన ఫైనల్లో 6–-7(1), 6-–7(2) తేడాతో ఫ్రాన్సిస్కో కాబ్రాల్ (పోర్చుగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)– లూకాస్ మీడ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు సెట్లనూ టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్పోయిన భాంబ్రీ జోడీ రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టింది.