
- ఎన్నికల ట్రైనింగ్‌కు రాలేదని జారీ
- కలెక్టరేట్ ఆఫీసర్ల నిర్వాకం
సంగారెడ్డి, వెలుగు: గతంలో ఆయనో పంచాయతీ సెక్రటరీ. గతేడాది ఫిబ్రవరి 2న యాక్సిడెంట్‌లో చనిపోయారు. కానీ తాజాగా ఆయనకు ఆఫీసర్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల డ్యూటీ వేశారు. అంతేనా.. ట్రైనింగ్‌కు రాలేదని షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో ఎండీ మొయిజొద్దీన్ పంచాయతీ సెక్రటరీగా పని చేసేవారు. డ్యూటీలో భాగంగా 2019 ఫిబ్రవరి 2న సంగారెడ్డి నుంచి న్యాల్కల్‌కు బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే సంగారెడ్డి కలెక్టరేట్ అధికారులు ఆయనకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల డ్యూటీ వేశారు. ఈ నెల 26న సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎలక్షన్ ట్రైనింగ్‌కు రావాలని చెప్పారు. ట్రైనింగ్‌కు రాకపోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో ఈ నెల 27న కలెక్టరేట్‌కు వచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని నోటీసు పంపారు. ఆ నోటీసు చూసి ఆయన కుటుంబీకులు నోరెళ్లబెట్టారు. మొయిజొద్దీన్ చనిపోయి 21 నెలలైందని.. ఆయనకు ఎలక్షన్ డ్యూటీ, షోకాజ్ నోటీసులేంటని అడుగుతున్నారు.