శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజుల పాటు పొడిగింపు

శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజుల పాటు పొడిగింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ మర్డర్ కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని... మరో 14 రోజుల పాటు పొడిగించారు. ఇవాళ అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు ముందు హాజరుపరిచారు. వ్యక్తిగతంగా హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు తీసుకువెళ్లలేదు. 

ఇదిలా ఉండగా.. కేసు దర్యాప్తులో ఓ అధికారి అఫ్తాబ్ చాలా తెలివైనవాడని.. కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అంతకుముందు డిసెంబరు 1న అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించగా, అతను తన ప్రియురాలిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పరీక్ష సమయంలో, అతను శ్రద్ధా దుస్తులను ఎక్కడ పారవేశాడో కూడా వెల్లడించాడు. తర్వాత ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా పోస్ట్-నార్కో పరీక్ష సమయంలో అఫ్తాబ్‌తో సంభాషించారు. ఇక ఈ కేసులో సాక్ష్యాధారాల కోసం ఢిల్లీ పోలీసులు మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు బృందాలను పంపారు. ఈ ఏడాది మే 18న శ్రద్దాను హత్య చేసిన కారణంగా అఫ్లాబ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు.