ఆర్మూర్ లో శ్రమదానం

ఆర్మూర్ లో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్మూర్​ టౌన్​లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్​ లో శ్రమదానం నిర్వహించారు. సంస్థ ప్రతినిధులతోపాటు హాస్టల్ నిర్వహకులు, స్టూడెంట్స్ పాల్గొని కలుపు మొక్కలు, చెత్తను తొలగించారు. అనంతరం పరిసరాలను శుభ్రంగా ఊడ్చారు.  సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 24 వారాలపాటు ప్రతి ఆదివారం ఒక గంట సేపు శ్రమదానం చేస్తామన్నారు. 

 హాస్టల్​ మెట్రిన్ సుమలత, సిబ్బంది మంగమ్మ, గంగామణి, రూపా, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బోడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, ముధుసూదన్, చోలా గుర్రం రాకేశ్, ఎల్లయ్య, వేణు, నరేశ్, ఆదిత్య పాల్గొన్నారు.