తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి ఆలయం

 తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి ఆలయం

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలయాలన్నీ తెరుచుకుంటున్నాయి. తాజాగా ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథుడి ఆలయం తెరుచుకోనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఆలయాన్ని తెరవనున్నారు. 21 రోజుల తర్వాత ఆలయంలోకి తిరిగి భక్తులు అనుమతి కల్పించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పూరి కలెక్టర్ సమత్ వర్మ తెలిపారు. ఒడిశాలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా భక్తుల కోసం జనవరి 10 న ఆలయాన్ని మూసివేశారు.

శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఛతీసా నిజోగ సమావేశం జరిగింది, ఇందులో SJTA చీఫ్ అడ్మినిస్ట్రేటర్ క్రిషన్ కుమార్, పూరీ కలెక్టర్, పూరీ SP కన్వర్ విశాల్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆలయాన్ని భక్తులకు తిరిగి తెరవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో ప్రతీ ఆదివారం పరిశుభ్రత కోసం మూసివేయబడుతుందని తెలిపారు. డబుల్ డోస్ టీకా సర్టిఫికేట్ లేదా RT-PCR పరీక్ష నివేదిక (ప్రవేశానికి 72 గంటల ముందు) ఉన్నవారికి మాత్రమే.. గుడిలో అనుమతి ఉంటుందన్నారు కలెక్టర్.  పూరీలోని స్థానిక భక్తులు పడమర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తుండగా, ఇతర భక్తులు తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తారని వర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ వ్యాలిడిటీ పెంపు

నాసికా బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు DCGI అనుమతి