నాసికా బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు DCGI అనుమతి

నాసికా బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు DCGI అనుమతి

ముక్కు  ద్వారా బూస్టర్‌ డోసు అందించేందుకు అవసరమైన క్లినికల్‌ ట్రయల్స్‌ నిమిత్తం భారత్‌ బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతినిచ్చింది. కోవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న వ్యక్తులకు నాసిక ద్వారా ఈ బూస్టర్‌ డోసు ప్రయోగించనున్నారు. ఇది అత్యవసర వినియోగానికి ఆమోదం పొందితే... భారీగా బూస్టర్‌ డోసులను అందించవచ్చు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో ట్రయల్స్‌ జరగనున్నాయి. నాసికా వ్యాక్సిన్‌ BBV 154ను ఇన్ఫెక్షన్‌ సోకే ముక్కు ద్వారా ఇవ్వడంతో రోగ నిరోధక ప్రతి స్పందనలను ప్రేరేపిస్తుందని, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఈ నాసికా వ్యాక్సిన్‌ సులభంగా వినియోగించవచ్చునని, దానికి ఆరోగ్య కార్యకర్తలు అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం భారత్‌ బయోటెక్‌ .. గత నెలలో డ్రగ్‌ రెగ్యులేటరీ షర్మిషన్  కోరింది.

 

మరిన్ని వార్తల కోసం..

 

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్