Virat Kohli: ఎక్కడైనా విన్ అవుతామనే నమ్మకాన్ని ఇచ్చాడు.. కోహ్లీ వన్డేలు వదిలేసి టెస్టులు ఆడాలి: RCB మాజీ ప్లేయర్

Virat Kohli: ఎక్కడైనా విన్ అవుతామనే నమ్మకాన్ని ఇచ్చాడు.. కోహ్లీ వన్డేలు వదిలేసి టెస్టులు ఆడాలి: RCB మాజీ ప్లేయర్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పి ప్రపంచ క్రికెట్ కు ఆశ్చర్యపరిచాడు. సూపర్ ఫామ్, అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న 37 ఏళ్ళ కోహ్లీ మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కానీ కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. అంతకముందు టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ప్రస్తుతం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ లేకపోవడంతో టెస్ట్ క్రికెట్ లో మజా తగ్గిపోయింది. ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఫ్యాన్స్ ను స్టేడియానికి రప్పించే  దమ్ము.. జట్టులో ఎంకరేజ్ మెంట్ చేసే వారు కరువయ్యారు. 

రాయల్ ఛాలెంజర్స్, బెంగాల్ మాజీ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి భారత జట్టుకు విరాట్ కోహ్లీ అవసరం ఉందని తెలిపాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ లోకి రావాలని సూచించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఇండియా ఆడుతున్న రెండో టెస్టులో మన జట్టు ఘోరంగా ఆడుతున్నారు. ముఖ్యంగా రెండో టెస్టులో పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఈ బెంగాల్ మాజీ క్రికెటర్ కోహ్లీని భారత టెస్ట్ జట్టులోకి రావాలని కోరాడు. బదులుగా వన్డే క్రికెట్ ను వదిలేయాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు.  

శ్రీవాత్స్ గోస్వామి మాట్లాడుతూ.."కోహ్లీ వన్డే క్రికెట్ ను విడిచి పెట్టాలి. టెస్ట్ క్రికెట్ ఆడడం కొనసాగించాలి. సాధ్యమైనంత ఎక్కువ కాలం దీర్ఘ కాలిక ఫార్మాట్ లో కొనసాగాలి. టెస్ట్ క్రికెట్ అతడిని మిస్ అవుతోంది. విరాట్ జట్టులోకి వస్తే ప్లేయర్ గానే కాదు జట్టులో ఉత్సాహాన్ని నింపగలడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ గెలవగలమని నిరూపించాడు. క్రికెట్ పై అతనికి ఉన్న ఇష్టం, కసి ఇండియాకు మరిన్ని విజయాలు అందిస్తాయి". అని శ్రీవాత్స్ గోస్వామి చెప్పుకొచ్చాడు. 

2011లో వెస్టిండీస్ టూర్ లో ఇండియా 269వ టెస్టు ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఈ ఫార్మాట్‌‌‌‌లోఅరంగేట్రం చేసిన విరాట్ 14 ఏండ్ల కెరీర్‌‌లో  పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. కెప్టెన్‌‌‌‌గా టీమిండియాను  జట్టును టెస్టు ర్యాంకింగ్‌‌‌‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-–19లో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌‌గా నిలిపాడు. దాంతో టెస్టులో మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఇండియా కెప్టెన్‌‌‌‌గా మారాడు.  

ఓవరాల్‌‌‌‌గా గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్,  స్టీవ్ వా తర్వాత  నాలుగో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌‌‌‌గా నిలిచాడు.  ఇండియా కెప్టెన్‌‌‌‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌ల్లో 11 గెలవడం విశేషం.  అయితే, గత నాలుగేండ్ల నుంచి తను క్రమంగా ఫామ్‌‌‌‌ కోల్పోయాడు. సౌతాఫ్రికాలో సిరీస్‌‌‌‌ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 36 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.