Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఒక భారీ ట్విస్ట్ నెలకొంది. గత సీజన్ (ఐపీఎల్ 2025) రన్నరప్స్ అయిన పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి దురదృష్టవశాత్తూ నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో 5 స్థానానికి పడిపోయి లీగ్ స్టేజ్ నుంచే ఇంటిబాట పట్టింది. ఈ సీజన్ మొదటి హాఫ్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, టాప్-2 లో నిలుస్తుందనుకున్న పంజాబ్.. సెకండ్ హాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి తప్పుకున్న రెండు రోజుల తర్వాత, శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా మౌనం వీడుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
శ్రేయస్ అయ్యర్ క్రేజీ పోస్ట్:
"ప్రతి రన్.. ప్రతి క్షణం.. ప్రతి పోరాటం.. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగుస్తోంది.. తదుపరి అధ్యాయం పరుగుల ఆకలితో (Hunger) మొదలవుతుందని శ్రేయస్ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. గత సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన అయ్యర్, ఈసారి లీగ్ స్టేజ్ దాటలేకపోవడంతో ఫ్యాన్స్ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సెకండ్ హాఫ్‌లో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, ముంబై, ఢిల్లీ, రాజస్థాన్ చేతుల్లో పంజాబ్ కింగ్స్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.
పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఫ్యూచర్?:
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరనప్పటికీ.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు.. వచ్చే సీజన్లో కూడా అయ్యరే పంజాబ్ కింగ్స్ జట్టును లీడ్ చేయనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ మేనేజ్మెంట్ అతనిపై ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి కొనుగోలు చేసింది. అయ్యర్ కెప్టెన్సీలోనే పంజాబ్ కింగ్స్ 10 ఏళ్ల తర్వాత (ఐపీఎల్ 2025లో) లీగ్ స్టేజ్ దాటి ఫైనల్ చేరింది. ఈసారి అదృష్టం కలిసిరాక లీగ్ చివరి మ్యాచ్ దాకా వచ్చి రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రేపే 'ఎలిమినేటర్' ఫైట్:
పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆశలపై నీళ్లు చల్లుతూ.. రాజస్థాన్ రాయల్స్ (RR) లీగ్ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్ లోని నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక రేపు (2026, మే 27న) జరగబోయే హై-వోల్టేజ్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు బలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన టీమ్ ఇంటికి వెళ్లిపోవాల్సిందే. గెలిచిన టీమ్ క్వాలిఫైయర్ 2 కి వెళ్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి సిట్యువేషన్ల నుంచి వచ్చి కప్ కొట్టిన రికార్డులు కూడా ఉన్నాయి. 2016 లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని ఎస్ఆర్హెచ్ టీమ్ టేబుల్లో మూడో స్థానంలో నిలిచినా.. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 గెలిచి, ఆపై ఫైనల్లో ఆర్సీబీపై గెలిచి కప్ కొట్టింది. మరి ఈసారి రాజస్థాన్, హైదరాబాద్ జట్లలో ఆ మ్యాజిక్ రిపీట్ చేసేది ఎవరో అనేది వేచి చూడాల్సి ఉంది.
Every run. Every moment. Every fight.
— Shreyas Iyer (@ShreyasIyer15) May 26, 2026
This chapter closes with gratitude and the next one begins with hunger. pic.twitter.com/ZRIS2U30H1
