తొలి ఇన్నింగ్స్: శ్రీలంక నాలుగో వికెట్ డౌన్

తొలి ఇన్నింగ్స్:  శ్రీలంక నాలుగో వికెట్ డౌన్

తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ ను 2 పరుగులకు, ఆ తర్వాత వెనువెంటనే తిరుమానెను  8 కే పెవిలియన్ చేర్చాడు బుమ్రా. తర్వాత వచ్చిన కెప్టెన్ దిముత్ కరుణ రత్నేను 4 , ధనుంజయ సిల్వాను 10 పరుగులకు ఔట్ చేశాడు షమి. దీంతో శ్రీలంక 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 43 రన్స్ చేసింది.శ్రీలంక ఇంకా 209పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్  252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్ అయ్యారు ఆదుకున్నాడు. వన్డే తరహాలో 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత  ఓపెనర్లు రోహిత్ శర్మ 15, మయాంక్ అగర్వాల్ 4 తక్కువ స్కోరుకే ఔటయ్యారు. తర్వాత వచ్చిన హనుమ విహారి 31, కోహ్లీ 23, రిషబ్ పంత్ 39, శ్రేయస్ అయ్యార్ 92 పరుగులతో రాణించారు.శ్రీలంక బౌలర్లలో  ఎంబుల్దానియా 3, జయవిక్రమ 3,సిల్వా 2 లక్మల్ ఒక వికెట్ తీశారు.