శ్రేయస్ కు ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ అవార్డ్

శ్రేయస్ కు ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ అవార్డ్

దుబాయ్: సూపర్​ ఫామ్‌‌లో ఉన్న టీమిండియా బ్యాటర్​ శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్​ ఆఫ్​ ది మంత్’​ అవార్డు గెలిచాడు. యూఏఈ క్రికెటర్ అరవింద్, నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ను వెనక్కునెట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డును శ్రేయస్ అందుకున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ తో పాటు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో అతడు అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. లంకపై మూడు టీ20ల్లో మూడు హాఫ్ సెంచరీలు  సహా 204 రన్స్ సాధించాడు.  విమెన్స్‌‌లో న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ అమెలియా కెర్​ను ఈ అవార్డు వరించింది.  ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్,  దీప్తి శర్మ ఈ రేసులో నిలిచినా.. కెర్​కే అవార్డు దక్కింది.