IND vs AUS: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియా 'ఎ' సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs AUS: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియా 'ఎ' సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియా 'ఎ'తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇండియా 'ఎ' జట్టును బీసీసీఐ గురువారం (సెప్టెంబర్ 25) ప్రకటించింది. సీనియర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఇండియా ఏ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ నుంచి అయ్యర్ బ్రేక్ తీసుకోవడంతో అతనికి బీసీసీఐ వన్డే కెప్టెన్సీ అప్పగించినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్యలో కాన్పూర్‌ వేదికగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో బాగ్ రాణించిన వారికి అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఆస్ట్రేలియా ఏ సిరీస్ కు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ:

ఆస్ట్రేలియా 'ఎ'తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కింది. ఇప్పటివరకు టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న అభిషేక్ శర్మ ఇకపై వన్డే క్రికెట్ లోకి రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్న ఈ పంజాబ్ హిట్టర్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న తెలుగు బ్యాటర్ తిలక్ వరం రెండు, మూడు వన్డేలకు వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉన్న  తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ రెండో వన్డేకు జట్టులో చేరనున్నారు.
 
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్: 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 
 
తొలి వన్డేకు ఇండియా ఎ జట్టు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ సింగ్ పోరెల్, ప్రియాన్స్ ఆర్య, సిమర్జీత్ సింగ్ 

రెండు, మూడు వన్డేలకు ఇండియా 'ఏ'  జట్టు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గురుజప్‌నీత్ సింగ్, గురుజప్‌నీత్ సింగ్, భిద్విర్ సింగ్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్