అట్టహాసంగా శ్రేయాస్ వన్ సిటీ బ్రోచర్ లాంచింగ్

అట్టహాసంగా శ్రేయాస్ వన్ సిటీ బ్రోచర్ లాంచింగ్

ఖమ్మం, వెలుగు: పట్టణ కేంద్రమైన ఖమ్మంలోని వందనం రోడ్డులో శ్రేయాస్ వన్ సిటీ బ్రోచర్ విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ బ్రోచర్ ను సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి, సింగర్ సునీత మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమా రంగంలో అప్రతిహాతంగా దూసుకెళ్తున్న శ్రేయాస్ మీడియా మొదటిసారిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు.

ఖమ్మం కలెక్టరేట్, గ్రీన్ ఫీల్డ్ హైవేకు అతి చేరువలో ఈ వెంచర్ ను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. అనంతరం శ్రేయాస్ వన్ సిటీలో సింగర్ సునీత లైవ్ కాన్సర్ట్ తో పాటలతో ఉర్రూతలూగించారు. తొలుత ఖమ్మం నగరంలోని సామాజిక సేవ చేసిన వారికి శ్రేయాస్ మీడియాస్ అధినేత గండ్ర శ్రీనివాస్ రావు ఉగాది పురస్కారాలు -2026 అందించారు. కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.