మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాంథమ్ సాంగ్‌‌‌‌ రిలీజ్

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాంథమ్ సాంగ్‌‌‌‌  రిలీజ్

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని  దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.  తాజాగా ఈ సినిమా నుంచి  యాంథమ్ సాంగ్‌‌‌‌ని రిలీజ్ చేశారు. ప్రకాష్  చెరుకూరి కంపోజ్ చేయగా వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మాత అరవింద్  మండెం రాసిన లిరిక్స్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉన్నాయి. బాబా సెహగల్​  ఎనర్జిటిక్‌‌‌‌గా పాడిన తీరు ఆకట్టుకుంది. 

ఇందులో  కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం  ఆసక్తిని పెంచింది.  ఈ పాట యూత్‌‌‌‌తో పాటు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు.  అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా,  త్వరలోనే   ప్రేక్షకుల ముందుకు రానుంది.