చిరంజీవితో ఐటం సాంగ్ లో శ్రియ

చిరంజీవితో ఐటం సాంగ్ లో శ్రియ

ఇరవై రెండేళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌‌‌‌గా నటించింది శ్రియ శరణ్. కెరీర్ ప్రారంభించిన షార్ట్ టైమ్‌‌‌‌లోనే స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ను అందుకుంది. ఓవైపు స్టార్ హీరోలు, మరోవైపు యంగ్ హీరోలతో నటిస్తూ కెరీర్‌‌‌‌‌‌‌‌ను చక్కగా ప్లాన్ చేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో సీనియర్ హీరోలకు భార్యగా, నాన్ గ్లామరస్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే యంగ్‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పర్ఫెక్ట్‌‌‌‌ ఫిజిక్‌‌‌‌ మెయింటెన్‌‌‌‌ చేస్తోంది శ్రియ.

దీంతో ఇటీవల స్పెషల్ సాంగ్‌‌‌‌ అవకాశాలు కూడా వస్తున్నాయట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలోని ఐటం సాంగ్ కోసం శ్రియను సంప్రదించినట్టు ప్రచారంలో ఉంది. గతంలో చిరంజీవికి జంటగా ‘ఠాగూర్‌‌‌‌‌‌‌‌’లో నటించింది శ్రియ. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత అదే జంట మళ్లీ కలిసి కనిపించబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ.. ఈసారి మెగాస్టార్‌‌‌‌‌‌‌‌తో కలిసి డ్యాన్స్ చేస్తుందేమో చూడాలి!