సలార్ సినిమా నాది కాదు.. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి

సలార్ సినిమా నాది కాదు.. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి

సౌత్ బ్యూటీ శృతి హాసన్(Shruthi haasan) వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య(Valteru veerayya) ఒకటికాగా.. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా వచ్చిన వీరసింహరెడ్డి(Veerasimhareddy) ఒకటి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ కెరీర్ మరింత జోరుగా ముందుకు సాగుతోంది. 

ఇక ఆమె హీరోయిన్ గా వస్తున్న మరో పాన్ ఇండియా అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్(Salaar). ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబోలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ తోనే అంచనాలు పెంచుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కారణం.. చాలా కాలంగా ప్రభాస్ కు సరైన హిట్ లేకపోవడం, కేజీఎఫ్ లాటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడం. 

దీంతో ఈ సినిమాను ముందు నుండి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఎక్కడ శృతి హాసన్ పేరు వినపడకపోవడం, టీజర్ లో కూడా ఆమెను చూపించుకోవడం వంటి వాటిపై ఆమె ఫ్యాన్స్ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై శృతిని ప్రశ్నించారు ఓక యాంకర్. సలార్ ని పదే పదే ప్రభాస్ మూవీ అంటుంటే మీకు బాధగా అనిపించడంలేదా అని అడిగారు. దానికి సమాధానంగా శృతి బదులిస్తూ.. అందులో బాధపడాల్సిన అవసరం ఏముంది. నిజంగా మాట్లాడుకుంటే సలార్ ప్రభాస్ మూవీనే. అందులో నేను భాగం మాత్రమే. మనం వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి.. అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. ప్రస్తుతం సలార్, ప్రభాస్ పై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ALSO READ :- మేడిగడ్డ కుంగడానికి సర్కార్ వైఫల్యమే కారణం