శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు జనవరిలో రిలీజ్

శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు జనవరిలో రిలీజ్

మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘క్రాక్‌‌‌‌‌‌‌‌’తో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. వచ్చి రావడంతోనే బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. అంతేకాదు ఆ మూవీ ఇచ్చిన సక్సెస్‌‌‌‌‌‌‌‌తో వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు జనవరిలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక

గోపీచంద్ మలినేని రూపొందిస్తోన్న మరో మాస్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘వీర సింహారెడ్డి’లో బాలకృష్ణకు జంటగా నటిస్తోంది శ్రుతి. ఇది కూడా సంక్రాంతికే రాబోతోంది. చిరు, బాలయ్య లాంటి సీనియర్ స్టార్స్‌‌‌‌‌‌‌‌తో స్క్రీన్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకోవడం శ్రుతికి ఇదే ఫస్ట్ టైమ్. ఈ రెండు చిత్రాల్లో తన క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంతవరకూ రివీల్ చేయలేదు. సంక్రాంతి సీజన్‌‌‌‌‌‌‌‌లో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అయితే శ్రుతికి మాత్రం రెండూ ఒకే సీజన్‌‌‌‌‌‌‌‌లో రావడం డబుల్ ధమాకానే. ఆల్రెడీ సంక్రాంతి సీజన్‌‌‌‌‌‌‌‌లోనే ‘క్రాక్‌‌‌‌‌‌‌‌’తో హిట్ అందుకుంది కనుక ఆ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. రెండూ మెప్పించినా, రెండింటిలో ఒకటి మెప్పించినా శ్రుతి అకౌంట్‌‌‌‌‌‌‌‌లో సంక్రాంతి సక్సెస్‌‌‌‌‌‌‌‌ మాత్రం కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్. మరోవైపు ప్రభాస్‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. వచ్చే యేడాది దసరా సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇది రిలీజ్ కానుంది.