శుభ్రాన్షు సింగ్‎కు ఫోర్బ్స్ గుర్తింపు

శుభ్రాన్షు సింగ్‎కు ఫోర్బ్స్ గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌‌‌‌ వైస్–ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అయిన శుభ్రాన్షు సింగ్, ప్రతిష్టాత్మకమైన 2025 ఫోర్బ్స్ వరల్డ్స్ మోస్ట్ ఇన్‌‌‌‌ఫ్లూయెన్షియల్ సీఎంఓల జాబితాలో చోటు దక్కించుకున్నారు.  అద్భుతమైన బ్రాండ్ నైపుణ్యం, వ్యూహాత్మక ఆలోచనలు,  భారతీయ సంస్కృతిపై లోతైన అవగాహన వల్లే ఈ గుర్తింపు సాధ్యమయిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.  ఈ సంవత్సరం, భారతదేశం నుంచి ఈ  జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు సీఎంఓలో శుభ్రాన్షు సింగ్​ఒకరని పేర్కొన్నాయి. ఈ గుర్తింపు భారత మార్కెటింగ్ నాయకత్వానికి గర్వకారణమని వివరించాయి.  ఇదిలా ఉంటే ఎఫీ లయన్స్​ ఫౌండేషన్​ కొత్తగా ఏర్పాటైన తమ బోర్డులో చేరాలని సింగ్‌‌‌‌ను ఆహ్వానించింది.