IND VS ENG 2025: ఒకే టెస్టులో 430 పరుగులు.. రికార్డుల మోత మోగించిన గిల్

IND VS ENG 2025: ఒకే టెస్టులో 430 పరుగులు.. రికార్డుల మోత మోగించిన గిల్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ కు తిరుగులేకుండా పోతుంది. ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారుతూ పరుగుల వరద పారించాడు. 100 కాదు.. 200 కాదు ఒకే టెస్టులో ఏకంగా 430 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ స్ట్రైక్ రేట్ 70 ఉంటే రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 100 ఉండడం విశేషం. ఈ టెస్టులో ఈ టీమిండియా కెప్టెన్ సృష్టించిన రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం. 

రెండు ఇన్నింగ్స్ ల్లో 150 పరుగులు:

టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ ల్లో  150 పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా గిల్ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ అలెన్ బోర్డర్ మాత్రమే టెస్ట్ క్రికెట్ చరిత్రలో గిల్ కు ముందు రెండు ఇన్నింగ్స్ ల్లో 150 పరుగులకు పైగా స్కోర్ చేశాడు. 1980 లో పాకిస్థాన్ పై ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ లాహోర్ లో ఈ ఘనత సాధించాడు. తాజాగా గిల్ ఆ యన సరసన చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గిల్ 269 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేశాడు. 

ALSO READ | IND VS ENG 2025: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యం

*రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసిన మూడో ఇండియన్ కెప్టెన్ గా గిల్ నిలిచాడు. గిల్ కు ముందు కోహ్లీ, గవాస్కర్ మాత్రమే టీమిండియా తరపున రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేశారు. 

*ఒకే టెస్టులో డబుల్ సెంచరీతో సెంచరీ చేసిన 9 ప్లేయర్ గా గిల్ రికార్డ్ సృష్టించాడు. 

*ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా గిల్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో గిల్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేశాడు. 1971లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ పై రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 344     పరుగుల రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.