IND VS ENG 2025: గిల్ రికార్డ్ డబుల్ సెంచరీ.. కెప్టెన్‌గా కోహ్లీని వెనక్కి నెట్టిన యువ సారధి

IND VS ENG 2025: గిల్ రికార్డ్ డబుల్ సెంచరీ.. కెప్టెన్‌గా కోహ్లీని వెనక్కి నెట్టిన యువ సారధి

టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తన సిరీస్ లోనే దంచికొడుతున్నాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ (222*: 323బంతుల్లో: 26 ఫోర్లు, 2 సిక్సర్లు)   తో అదరగొట్టాడు. గిల్ టెస్ట్ కెరీర్ లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. డబుల్ సెంచరీతో గిల్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టాడు. విదేశాల్లో కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్ గా నిలిచాడు. 

ALSO READ | IND VS ENG 2025: అసలు సిసలు కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఇది: ఎడ్జ్ బాస్టన్ టెస్టులో గిల్ డబుల్ సెంచరీ

గతంలో ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2016 లో వెస్టిండీస్ పై కోహ్లీ 200 పరుగులు చేశాడు. ఈ రికార్డును గిల్ తాజాగా బ్రేక్ చేశాడు.  ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్‌లో గిల్ యావరేజ్ కేవలం 14.66 మాత్రమే ఉంది. దీంతో గిల్ పై చాలా విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ లో చెత్త రికార్డ్స్ ఉన్నవాడికి టెస్ట్ కెప్టెన్సీ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. అయితే గిల్ తన కెప్టెన్సీకి న్యాయం చేశాడు. బ్యాటింగ్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గిల్ తో పాటు సుందర్ మరో ఎండ్ లో బ్యాట్ ఝులిపించడంతో తొలి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఇండియా 6 వికెట్ల నష్టానికి 496 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (222), సుందర్ (23) ఉన్నారు.