
ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో రెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. బాధ్యతగా ఆడుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కు నిర్వచనంలా మారాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదరొడ్డి నిలుస్తూ 311 బంతుల్లో 200 పరుగుల మార్క్ అందుకున్న గిల్.. టెస్ట్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. గిల్ ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. శుభమాన్ డబుల్ సెంచరీతో టీమిండియా 500 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం లంచ్ తర్వాత టీమిండియా 6 వికెట్ల నష్టానికి 472 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (200) సుందర్ (21) ఉన్నారు.
6 వికెట్ల నష్టానికి 419 పరుగులతో రెండో లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వేగంగా పరుగులు రాబట్టింది. ఒక ఎండ్ లో సుందర్ నిదానంగా ఆడినా మరో ఎండ్ లో గిల్ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు శరవేగంగా ముందుకు కదిలింది. టంగ్ వేసిన 118 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 10 పరుగులు రాబట్టిన గిల్..198 పరుగులకు చేరుకున్నాడు. గిల్ 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుందర్ కొన్ని బౌండరీలతో అలరించాడు. టంగ్ బౌలింగ్ లో వరుసగా 4, 6 కొట్టి గిల్ పై ఒత్తిడి తగ్గించాడు. టంగ్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో సింగిల్ తీసి గిల్ 200 డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ALSO READ | IND VS ENG 2025: కెప్టెన్ ఒంటరి పోరాటం: గిల్ భారీ సెంచరీ.. 400 పరుగులు దాటిన టీమిండియా
రెండో రోజు ఆటలో భాగంగా 89 పరుగులు చేసిన జడేజా తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. తొలి రోజు జైశ్వాల్ 87 పరుగులు చేసి రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్స్, టంగ్, స్టోక్స్, బషీర్ తలో వికెట్ పడగొట్టారు.
THE FIRST INDIA CAPTAIN TO SCORE A DOUBLE HUNDRED IN ENGLAND!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 3, 2025
Shubman Gill, absolutely sensational! 🙌 pic.twitter.com/GYEsdcm8Wm