IND vs SA: రెండేళ్ల తర్వాతే నేను టాస్ గెలుస్తానేమో.. నిరాశలో గిల్ కామెంట్స్

IND vs SA: రెండేళ్ల తర్వాతే నేను టాస్ గెలుస్తానేమో.. నిరాశలో గిల్ కామెంట్స్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. బ్యాటర్ గా అత్యుత్తమంగా ఆడుతున్నా.. కెప్టెన్సీలో అదరగొడుతున్నా ఒక విషయంలో మాత్రం గిల్ కు అదృష్టం కలిసి రావడం లేదు. కెప్టెన్ గా గిల్ టాస్ గెలవడంతో విఫలమవుతున్నాడు  కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిల్ ఇప్పటివరకు 11 మ్యాచ్ ల్లో ఒకసారి మాత్రమే టాస్ గెలిచాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తొలిసారి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్..స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో మాత్రమే టాస్ గెలిచాడు. 

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల్లో టాస్ ఓడిన గిల్.. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఒక టెస్టులో టాస్ గెలిచాడు. వన్డే కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియా టూర్ లో మూడు వన్డేల్లో టాస్ ఓడిన ఈ యువ సారధి.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులోనూ టాస్ గెలవలేకపోయాడు. దీంతో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టాస్ ఓడిపోవడంపై గిల్ ను ప్రశ్నించాడు. శాస్త్రి అడిగిన ప్రశ్నకు గిల్ నిరాశలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. " నేను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టాస్ గెలవాలని ఆశిస్తున్నా". అని సమాధానమిచ్చాడు. 

ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం (నవంబర్ 14) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తుది జట్టులో స్థానం సంపాదించారు. నలుగురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కూడా భారత జట్టులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ కొత్త బంతిని పంచుకోనున్నారు. ప్రస్తుతం మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజ్ లో  టోనీ డి జోర్జీ (14), వియాన్ ముల్డర్ (1) ఉన్నారు. ఇండియా బౌలర్లలో బుమ్రా రెండు.. కుల్దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.