- గుజరాత్..జిగిల్
- ఐపీఎల్-19 ఫైనల్కు టైటాన్స్
- క్వాలిఫయర్–2లో రాజస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
- రాణించిన సుదర్శన్, బౌలర్లు
- సూర్యవంశీ మెరుపులు వృథా
ముల్లన్పూర్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్.. మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుభ్‌మన్ గిల్ (53 బాల్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు సాయి సుదర్శన్ (32 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. టాస్ గెలిచిన రాజస్తాన్ 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (47 బాల్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96), జడేజా (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్), ఫెరీరా (11 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38 నాటౌట్) రాణించారు. తర్వాత గుజరాత్ 18.4 ఓవర్లలో 219/3 స్కోరు చేసి నెగ్గింది. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్.. బెంగళూరుతో తలపడుతుంది.
వైభవ్ ధనాధన్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను ఆరంభంలో జీటీ బౌలర్లు కట్టడి చేసినా.. వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (1)ను ఔట్ చేసి సిరాజ్ (1/42) షాక్ ఇచ్చాడు. దాన్ని కొనసాగిస్తూ రెండో ఓవర్‌లో రబాడ (2/35).. ధ్రువ్ జురెల్ (7)ను పెవిలియన్‌కు పంపాడు. 9/2 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను సూర్యవంశీ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. రెండో ఎండ్‌లో జడేజా అండగా నిలిచాడు. మూడో ఓవర్‌లో మూడు ఫోర్లతో మొదలైన సూర్యవంశీ విధ్వంసం 17 ఓవర్లు పాటు సాగింది. నాలుగో ఓవర్‌లో 4, 6, ఆ వెంటనే ఫోర్ దంచాడు. ఆరో ఓవర్‌లో జడేజా 6, 4, 4తో పవర్‌ప్లేలో రాజస్తాన్ 70/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన రియాన్ పరాగ్ (11) 9వ ఓవర్‌లో 4, 6, సూర్యవంశీ 6తో 18 రన్స్ రాబట్టారు. కానీ 10వ ఓవర్‌లో పరాగ్‌ను ఔట్ చేసి హోల్డర్ (2/27) బ్రేక్ ఇచ్చాడు. దాంతో రాయల్స్ 103/3తో తొలి పది ఓవర్లను ముగించింది. ఓ ఎండ్‌లో సూర్యవంశీ మెరుపులు మెరిపించినా.. రెండో ఎండ్‌లో జీటీ బౌలర్లు వికెట్లు తీశారు. 12వ ఓవర్‌లో హోల్డర్.. డాసున్ షనక (3)ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో సిక్స్ కొట్టిన ఆర్చర్ (7)ను ప్రసిధ్ కృష్ణ (1/42) వెనక్కి పంపాడు. 17 రన్స్ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో రాయల్స్ 118/5తో నిలిచింది. 46 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను సుదర్శన్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న సూర్యవంశీ 31 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. మళ్లీ క్రీజులోకి వచ్చిన జడేజా కూడా బ్యాట్ ఝుళిపించాడు. తర్వాత రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు కొట్టిన సూర్యవంశీ 18 రన్స్ రాబట్టడంతో స్కోరు 15 ఓవర్లలో 138/5కి చేరింది. 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో హోల్డర్‌కు చుక్కలు చూపెట్టిన సూర్యవంశీ తర్వాత సుందర్ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. 96 రన్స్ వద్ద రబాడ బాల్‌ను భారీ షాట్‌కు యత్నించి థర్డ్ మ్యాన్‌లో ప్రసిధ్‌కు క్యాచ్ ఇవ్వడంతో సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆరో వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన డొనోవాన్ ఫెరీరా.. రషీద్ వేసిన ఆఖరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో 27 రన్స్ దంచడంతో రాయల్స్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
ఓపెనర్లు అదుర్స్..
తొలి ఓవర్‌లో చెరో రెండు ఫోర్లతో ఛేదన మొదలుపెట్టిన గిల్, సుదర్శన్ రాయల్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు మాత్రమే కొట్టిన ఈ ఇద్దరు ఎక్కడా భారీ షాట్లకు పోలేదు. దాంతో పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా లేకుండా 69 రన్స్ జత చేశారు. ఇక్కడి నుంచి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. చివరకు 9వ ఓవర్‌లో తొలి సిక్స్‌తో గిల్ 30 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. పదో ఓవర్‌లో గిల్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో స్కోరు 127/0కు పెరిగింది. 11వ ఓవర్‌లో ఫోర్‌తో సుదర్శన్ 26 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక్కడి నుంచి గిల్ వరుసపెట్టి ఫోర్లు దంచాడు. అయితే 13వ ఓవర్‌లో సుదర్శన్ అనూహ్యంగా రెండోసారి హిట్ వికెట్ అయ్యాడు. బ్రిజేశ్ బౌలింగ్‌లో ముందుకొచ్చే ఆడే క్రమంలో బ్యాట్ జారిపోయి వికెట్లకు తాకింది. తొలి వికెట్‌కు 169 పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆ వెంటనే ఫోర్‌తో గిల్ 47 బాల్స్‌లో సెంచరీ చేశాడు. 15వ ఓవర్‌లో గిల్ ఔట్ కావడంతో విజయ సమీకరణం 30 బాల్స్‌లో 33గా మారింది. దీన్ని ఛేదించే క్రమంలో సుందర్ (16) ఔటైనా.. బట్లర్ (9 నాటౌట్), రాహుల్ తెవాటియా (17 నాటౌట్) విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 214/6 (వైభవ్ 96, జడేజా 45*, ఫెరీరా 38*, హోల్డర్ 2/27). గుజరాత్: 18.4 ఓవర్లలో 219/3 (గిల్ 104, సుదర్శన్ 58, బర్గర్ 1/35).
ఐపీఎల్‌లో అతి తక్కువ బాల్స్‌లో వెయ్యి రన్స్ చేసిన తొలి బ్యాటర్ సూర్యవంశీ (440). రసెల్ (545) రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ఒక సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్
మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (19)
కొట్టిన తొలి బ్యాటర్ సూర్యవంశీ.
సాహా (11), గిల్ (11) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
