
టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో కింగ్ కోహ్లీ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఐదు సెంచరీలు చేసి శభాష్ శుభ్ మన్ అనిపించుకుంటున్నాడు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగుతున్న రెండో టెస్టులో.. సూపర్ సెంచరీతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఐదు సెంచరీలు నమోదు చేసి కోహ్లీ సరసన నిలిచాడు గిల్.
వెస్టిండీస్ తో జరుతున్న రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. క్లాస్ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ చేసుకున్నాడు. మొత్తం 177 బంతులలో 13 ఫోర్లు, ఒక సిక్సుతో సెంచరీ పూర్తి చేశాడు. 130 వ ఓవర్లో 5వ బాల్ కు.. ఖేరీ పియరీ వేసిన బాల్ ను లెఫ్ట్ కవర్స్ వైపు పంపించి మూడు రన్స్ తీసిన గిల్.. ఈ టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టెస్టుల్లో గిల్ కు ఇది పదో సెంచరీ. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇది ఐదో టెస్టు సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్ లో కెప్టెన్ గిల్ ఖాతాలో 5వ టెస్టు సంచరీ నమోదు కావడం విశేషం. అంతకు ముందు ఇదే ఫీట్ ను విరాట్ కోహ్లీ వరుసగా 2017, 2018లో సాధించాడు. టెస్టులలో ఒక క్యాలెండర్ ఇయర్ లో కెప్టెన్ గా ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ ఫీట్ ను సమం చేశాడు గిల్. కేవలం 7 టెస్టులలో 5 సెంచరీలు నమోదు చేయడం విశేషం.
►ALSO READ | Ind vs WI: టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్.. వెస్టిండీస్కు భారీ టార్గెట్
టీమ్ లో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేని వేళ.. కెప్టెన్సీ బాధ్యతలు అనూహ్యంగా శుభ్ మన్ గిల్ అప్పగించింది బీసీసీఐ. రోహిత్ సక్సెస్ ఫుల్ కెప్టెన్సీ తర్వాత టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన గిల్.. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెట్టాడు. మొదటి టెస్టులో భారీ విజయాన్ని అందించిన గిల్.. రెండో టెస్టులో జైస్వాల్ (175)తో పాటు సెంచరీ చేసి స్కోర్ ను 500 పరుగుల మార్కును దాటించాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఐదు సెంచరీలు బాదిన ఇండియా కెప్టెన్లు:
1. విరాట్ కోహ్లీ - 2017
2. విరాట్ కోహ్లీ - 2018
3. శుభ్ మన్ గిల్ - 2025
𝙂𝙡𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙂𝙞𝙡𝙡 ✨
— BCCI (@BCCI) October 11, 2025
A 💯 to savour from the #TeamIndia skipper 🫡
His first as Captain on home soil 🇮🇳
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ocO5Hk5hrr