IND vs WI 1st Test: సచిన్, కోహ్లీ తర్వాత నాలుగో స్థానానికి కొనసాగుతున్న క్రేజ్.. గిల్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు

IND vs WI 1st Test: సచిన్, కోహ్లీ తర్వాత నాలుగో స్థానానికి కొనసాగుతున్న క్రేజ్.. గిల్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు

టీమిండియా టెస్ట్ క్రికెట్ లో నాలుగో స్థానానికి చాలా క్రేజ్ ఉంది. గత 30 ఏళ్ళల్లో ఈ స్థానంలో కేవలం ఇద్దరు దిగ్గజాలు మాత్రమే బ్యాటింగ్ చేశారు. వారిలో ఒకరు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కాగా.. మరొకరు సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ. దాదాపు 15 ఏళ్లుగా నాలుగో స్థానంలో టెస్ట్ క్రికెట్ లో సచిన్ బ్యాటింగ్ ఆడితే ఆ తర్వాత ఆ స్థానాన్ని కోహ్లీ కొనసాగించాడు. దీంతో నాలుగో స్థానం అంటే టీమిండియా ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. గిల్ తన తొలి సిరీస్ లోనే నెంబర్ 4 లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. 

ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఏకంగా 754 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ సిరీస్ తో గిల్ కూడా నాలుగో స్థానంలో తన ప్లేస్ ను పర్మినెంట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా రెండో వికెట్ కోల్పోగానే టీమిండియా ఫ్యాన్స్ డ్రెస్సింగ్ రూమ్ వైపుగా ఎంతో ఆసక్తిగా చూశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి రోజు ఆటలో భాగంగా వందలాది మంది గిల్ ను చూసేందుకు అభిమానులు స్టాండ్స్‌పై పరుగెత్తుతూ కనిపించారు. భారత కెప్టెన్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు వస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. 

ALSO READ : కౌన్ బనేగా కరోడ్ పతిలో ఇండియన్ క్రికెట్‌పై రూ.50,00,000 ప్రశ్న.. సమాధానమిదే!

ఫ్యాన్స్ తమ సీట్లలో నుంచి లేచి చేతిలో మొబైల్ ఫోన్‌లతో గిల్ ను ఫోటోలు తీయడం ప్రారంభించారు. గిల్ పై అభిమానులు చూపిస్తున్న అభిమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగో స్థానంలో ఆడుతున్న కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి స్వదేశీ సిరీస్ ఇదే. భారత క్రికెట్ లో గిల్ శకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంతో ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది.  ఓవైపు కెప్టెన్ గా, మరోవైపు బ్యాటర్ గా గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో మోస్ట్ బిజీయెస్ట్ క్రికెటర్ గా మారనున్నాడు. మరి సచిన్, కోహ్లీ తర్వాత గిల్ ఆ రేంజ్ కు వెళ్తాడో లేదో చూడాలి.