రోహిత్ స్థానంలో గిల్.. కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన టీమిండియా కెప్టెన్

రోహిత్ స్థానంలో గిల్.. కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన టీమిండియా కెప్టెన్

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడంపై ఫ్యాన్స్ లో సీరియస్ చర్చ కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ కు ముందు తొలగించారంటే.. ఇక ప్రపంచ కప్ లో చోటు ఉంటుందో లేదో అనే సందేహాలు నెలకొన్న వేళ.. ఇక నుంచి కెప్టెన్ గా గిల్ నే కొనసాగిస్తారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీపై.. కొత్త కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించాడు. 

డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లలో రోహిత్ నింపే స్పిరిట్ చాలా గొప్పదని కొనియాడిన గిల్..  టీమ్ యూనిటీ గా ఉంచే విషయంలో రోహిత్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు. ప్రశాంతంగా.. కామ్ గా ఉంటూ టీమ్ లో ధైర్యా్న్ని, స్పిరిట్ నింపే విషయాన్ని రోహిత్ నుంచి నేర్చుకుంటానని అన్నాడు. అక్టోబర్ లో ఆస్ట్రేలియా టూర్ లో రోహిత్ నుంచి చాలా క్వాలిటీస్ నేర్చుకునే ప్రయత్నం చేస్తానని గురువారం (అక్టోబర్ 09) గిల్ చెప్పాడు. 

ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు గిల్. 2-0 తేడాతో టెస్టు క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంలో ఉంది టీమిండియా. తర్వాత అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా తో వన్డే సీరీస్ ఉంది. 

అదే క్రమంలో రోహిత్, కోహ్లీ ఫూచర్ గురించి వస్తున్న సందేహాలపై గిల్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ మ్యాచ్ విన్నర్ లు అని.. వారికి ఎన్నో స్కిల్స్ ఉన్నాయని అన్నాడు. వారి స్కిల్స్ తాము అందిపుచ్చుకోవాల్సి ఉందన అన్నాడు గిల్. టీమిండాయకు అలాంటి అనుభవం ఉన్న ఆటగాళ్ల అవసరం ఉందన్నాడు.