ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇవాళ ముఖర్జీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటారు బీజేపీ నేతలు. దేశ ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ కష్టపడ్డారని బండి సంజయ్ అన్నారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు ఉండొద్దని గట్టిగా పోరాడారని గుర్తు చేసుకున్నారు.

అటు ఢిల్లీలోని పార్లమేంటరీ సెంట్రల్ హాల్ లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యామా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. పూలమాలలు వేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు.