లంచం తీసుకుంటూ దొరికిపోయి ఏడ్చేసింది

లంచం తీసుకుంటూ దొరికిపోయి ఏడ్చేసింది

హర్యానాకు చెందిన ఓ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ  విజిలెన్స్‌ ఏజెన్సీకి  రెడ్హ్యాండెడ్ గా దొరికిపోయింది. బవానీ ఖేరా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మున్నీ దేవి  రికవరీ కేసులో ఓ మహిళను రూ.5000 లంచం డిమాండ్ చేసింది. అయితే ఆ మహిళ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసింది.

దీంతో అనిశా అధికారులు అధికారులు ఆమెను ట్రాప్ చేసి పట్టుకున్నారు. దీంతో మున్నీ దేవి కన్నీరు పెట్టుకుంది. తాను అమాయకురాలినని వాపోయింది. దీనికి సంబంధించిన వీడియోను నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ట్విట్టర్ లో షేర్ చేయగా  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

https://twitter.com/NCIBHQ/status/1640902537380528128